ఫేమ్2 పథకం కేటాయింపులను పెంచిన కేంద్రం

by S Gopi |
ఫేమ్2 పథకం కేటాయింపులను పెంచిన కేంద్రం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఫేమ్‌)-2 పథకం కింద వాహనాలకు ఇచ్చే రాయితీని రూ. 10,000 కోట్ల నుంచి రూ. 11,500 కోట్లకు పెంచుతూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పరిశ్రమల మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ఫేమ్ పథకం కింద రెండో దశలో కేంద్రం రూ.10,000 కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి రూ. 1,500 కోట్లు పెంచింది. ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ టూ, త్రీ, ఫోర్‌ వీలర్‌ కొనుగోళ్లపై సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకం ఈ ఏడాది మార్చి 31తో ముగియనుంది. ఆ తర్వాత కొనసాగింపుపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే, రెండు దశల్లో ఈ పథకం సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నయ ఇంధనం వైపు ప్రజలను మళ్లించాలంటే దీని కొనసాగింపు అవసరమని భారీ పరిశ్రమల శాఖ గతంలో కేంద్రానికి సూచించింది.

Advertisement

Next Story