- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CBDT-IT: హోటళ్లు, ఆసుపత్రులు.. తనిఖీ చేయాలని IT శాఖను ఆదేశించిన CBDT
దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పేరుకుపోయిన పన్ను బకాయిలను వసూలు చేయడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) సమాయత్తమైంది. ఈ క్రమంలో తాజాగా ఐటీ(IT) శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. హోటళ్లు, లగ్జరీ బ్రాండ్ విక్రయాలు, ఆసుపత్రులు, ఐవీఎఫ్ క్లినిక్‌లు వంటి వ్యాపార రంగాల్లో ప్రబలంగా జరుగుతున్న నగదు లావాదేవీలను తనిఖీ చేయాలని సీబీడీటీ, IT శాఖను కోరింది. రూ. 2 లక్షలకు పైగా నగదు రూపంలో జరిగే లావాదేవీలను ఆర్థిక సంస్థల ద్వారా ఎస్‌ఎఫ్‌టి రిపోర్ట్ చేయాల్సి ఉంది, అయితే అది జరగడం లేదని సీనియర్ అధికారులు తెలిపారు.
పలు రికార్డుల పరిశీలన తర్వాత నిబంధనలు అతిక్రమించి కొంతమంది తమ బకాయిలు చెల్లించడం లేదని గుర్తించాం. కొన్ని వ్యాపార సంస్థల్లో నిబంధనలు పాటించకుండా, పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతున్నట్లు వెల్లడైంది, అటువంటి మూలాలను గుర్తించి పన్ను చెల్లింపులు పెరిగేలా చూడటానికి ఐటీ శాఖ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించినట్టు సీబీడీటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
అంతకుముందు 2023-24 ఆర్థిక సంవత్సరంలో పన్ను ఎగవేతలను తనిఖీ చేసేందుకు పన్ను శాఖ దేశవ్యాప్తంగా 1,100 దాడులు నిర్వహించి దాదాపు రూ. 2,500 కోట్లను సీజ్ చేసింది, వాటిలో రూ.1,700 కోట్లు నగదు రూపంలో ఉన్నాయి. అటూ మొండి బకాయిలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 1, 2023 నాటికి రూ. 24,51,099 కోట్ల నుండి ఏప్రిల్ 1, 2024 నాటికి రూ. 43,00,232 కోట్లకు పెరిగిందని సీబీడీటీ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది.