2024 చివరి నాటికి 50 శాతం మహిళా ఉద్యోగులే లక్ష్యం: బ్రిటానియా!

by Vinod kumar |
2024 చివరి నాటికి 50 శాతం మహిళా ఉద్యోగులే లక్ష్యం: బ్రిటానియా!
X

మధురై: ఎఫ్ఎంసీజీ దిగ్గజం బ్రిటానియా 2024 నాటికి మహిళా ఉద్యోగుల సంఖ్యను 50 శాతానికి పెంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించినట్టు కంపెనీ ఆదివారం ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం సంస్థలో 41 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. దేశవ్యాప్తంగా 15 తయారీ ప్లాంటు, 35 కాంట్రాక్ట్, ఫ్రాంచైజీలలో లక్ష మదికి పైగా ఉద్యోగులున్నారు. వారిలో 41 శాతం మంది మహిళా ఉద్యోగులున్నారు. వీరి సంఖ్యను వచ్చే ఏడాది చివరి నాటికి 50 శాతానికి పెంచాలని నిర్ణయించామని కంపెనీ తయారీ హెడ్ ఇంద్రనీల్ గుప్తా అన్నారు.

కంపెనీకి చెందిన మదురై తయారీ యూనిట్లో 190 టన్నుల ఉత్పత్తులను తయారు చేస్తున్నామని, అందులో 65 శాతం మంది మహిళా ఉద్యోగులుండగా, దీన్ని 2024 నాటికి 70 శాతానికి పెంచుతామని ఇంద్రనీల్ గుప్తా చెప్పారు. తమ ఉత్పత్తుల తయారీకి మహిళలైతే ఎక్కువ పరిశుభ్రంగా, ఆహార ఉత్పత్తుల తయారీకి అవసరమైన నాణ్యత, మెరుగుదలకు ఆస్కారం ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ రకమైన తయారీలో మగ ఉద్యోగులతో పోలిస్తే మహిళలు మరింత క్రమశిక్షణతో తయారీని పూర్తి చేయగలరనే విశ్వాసాన్ని కలిగి ఉన్నామని ఆయన వివరించారు.

Advertisement

Next Story