- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మూడు కొత్త ఫ్లేవర్ డ్రింక్స్ తీసుకొచ్చిన బిస్లరీ ఇంటర్నేషనల్!

ముంబై: దేశీయ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, కార్బోనేటేడ్ సాఫ్ట్‌డ్రింక్స్ కంపెనీ బిస్లరీ ఇంటర్నేషనల్ మార్కెట్లోకి కొత్తగా మూడు రకాల ఫ్లేవర్లను తీసుకొచ్చింది. ఆరెంజ్ ఫ్లేవర్‌లో బిస్లరీ పాప్, జీరా ఫ్లేవర్‌లో బిస్లరీ స్పైసీ, కోలా ఫ్లేవర్‌లో బిస్లరీ రేవ్ పేరుతో కంపెనీ వాటిని విడుదల చేసింది. కొత్త ఫ్లేవర్ ఉత్పత్తులను వినియోగదారులకు చేరువ చేసేందుకు కంపెనీ డిజిటల్, సోషల్ మీడియాలు, రిటైల్, జనరల్ స్టోర్లను వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
దేశీయ మార్కెట్లో అనేక విభిన్న ఉత్పత్తులను కంపెనీ పరిచయం చేసింది. ఆ తరహా బ్రాండింగ్‌ను కొనసాగించాలనే ఉద్దేశంతో కొత్త ఫ్లేవర్లను తీసుకొచ్చామని కంపెనీ వైస్-ఛైర్‌పర్సన్ జయంతి చౌహాన్ అన్నారు. అలాగే, కొత్త తరం వినియోగదారులకు తమ ఉత్పత్తులను పరిచయం చేసేందుకు అవసరమైన వ్యూహాలను అనుసరిస్తున్నామని ఆమె తెలిపారు. కొత్త ఫ్లేవర్ ఉత్పత్తులను ప్రస్తుతానికి మార్కెట్లో 160ఎంఎల్, 600ఎంఎల్ పరిమాణాల్లో అందుబాటులోకి తెచ్చినట్టు జయంతి చౌహాన్ పేర్కొన్నారు.