అనంత్ అంబానీ- రాధిక ప్రీ వెడ్డింగ్‌కు వస్తున్న బిల్ గేట్స్, జుకర్‌బర్గ్, ఇవాంకా ట్రంప్

by Harish |
అనంత్ అంబానీ- రాధిక ప్రీ వెడ్డింగ్‌కు వస్తున్న బిల్ గేట్స్, జుకర్‌బర్గ్, ఇవాంకా ట్రంప్
X

దిశ, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల పెళ్లికి ముందు జరిగే ప్రీ-వెడ్డింగ్ వేడుకలు మార్చి 1 నుండి మార్చి 3 వరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరగనున్నాయి. ఈ వేడుకలకు వివిధ దేశాలకు చెందిన ప్రపంచ ధనవంతులు, అంతర్జాతీయంగా పేరొందిన అతిథులు, రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. వీరిద్దరికి 2022 డిసెంబర్‌లోనే ఎంగేజ్‌మెంట్ జరగ్గా వివాహం జులై 12న ముంబైలో జరగనుంది.

జామ్‌నగర్‌లో జరిగే ఈ ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మోర్గాన్ స్టాన్లీ సీఈవో టెడ్ పిక్, ఖతార్ ప్రధాని మహ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, ఇవాంకా ట్రంప్, డిస్నీ CEO బాబ్ ఇగర్, Adobe CEO శంతను నారాయణ్, బ్లాక్‌రాక్ CEO లారీ ఫింక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా చైర్మన్ బ్రియాన్ థామస్ మొయినిహాన్, బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ CEO బ్రూస్ ఫ్లాట్, లూపా సిస్టమ్స్ CEO జేమ్స్ ముర్డోక్, కెనడా, ఆస్ట్రేలియా, స్వీడన్ మాజీ ప్రధాన మంత్రులు, భూటాన్ రాజు- రాణి, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చైర్‌పర్సన్ క్లాస్ స్క్వాబ్ మొదలగు వారు హాజరుకానున్నారు.


  • Dishadaily Web Stories

  • Advertisement

    Next Story

    Most Viewed