- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
2040 నాటికి బీపీసీఎల్ సున్నా కర్బన ఉద్గార లక్ష్యం!

న్యూఢిల్లీ: దేశీయ రెండో అతిపెద్ద చమురు శుద్ధి, ఇంధన రిటైల్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ 2040 నాటికి పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియోను 10 గిగావాట్లకు పెంచనున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే, అదే సమయానికి సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాలను చేరుకుంటుందని బీపీసీఎల్ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ అన్నారు. సంస్థ వాటాదారుల సమావేశంలో మాట్లాడిన ఆయన, బీపీసీఎల్ ప్రత్యామ్నాయ వ్యాపారాలకు విస్తరిస్తోంది. దీనివల్ల అదనపు ఆదాయ మార్గాలను అందుకోవడమే కాకుండా చమురు, గ్యాస్ వ్యాపారాల్లో ఏర్పడే ప్రతికూలతను అధిగమించవచ్చని అరుణ్ కుమార్ పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయంలో భాగంగా కంపెనీ పలు వ్యూహాత్మక విభాగాలను గుర్తించింది. అందులో పెట్రోల్ కెమికల్స్, గ్యాస్, పునరుత్పాదక వస్తువులు, వినియోగదారు రిటైలింగ్, ఈ-మొబిలిటీ, ఇతర కొత్త వ్యాపారాలు ఉన్నాయి. ఇవి సంస్థ భవిష్యత్తు అభివృద్ధికి మూలస్తంభాలుగా ఉండనున్నాయి. ప్రధాన పెట్రోలియం శుద్ధి, మార్కెటింగ్ విభాగం కీలక మద్దతుగా ఉంటుంది. పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రస్తుతం 50 మెగావాట్ల కంటే తక్కువ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. దీన్ని 2025 నాటికి 1 గిగావాట్, 2040 నాటికి 10 గిగావాట్లకు పెంచాలనే లక్ష్యంతో ఉన్నామని ఆయన వెల్లడించారు.