FDలపై అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే.. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకమైన స్కీములు!

by Vennela |   ( Updated:2025-02-11 13:08:37.0  )
FDలపై అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే.. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకమైన స్కీములు!
X

దిశ, వెబ్ డెస్క్: Fixed deposits: పలు బ్యాంకులు అమలు చేసే ఫిక్స్డ్ డిపాజిట్ ( Fixed deposits)స్కీమ్స్ కు ప్రజల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. కాలానుగుణంగా ఎన్ని పెట్టుబడి మార్గాలు వచ్చినప్పటికీ వీటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. నిర్ణీత కాలానికి అసలుతో కలిపి వడ్డీ పొందడం, మార్కెట్ రిస్కులతో సంబంధం లేకుండా రాబడి రావడంతో వీటిలో డబ్బులను ఎక్కువ మంది పెట్టుబడి పెడుతుంటారు. అలాగే సీనియర్ సిటిజన్లు తమ డబ్బులను వీటిలోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. సాధారణ ఖాతాదారులతో పోల్చితే సీనియర్ సిటిజన్ల(Senior citizens)కు ఎక్కువ వడ్డీని అందిస్తాయి. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లకు 9.5శాతం వరకు వడ్డీ అందిస్తున్న బ్యాంకుల వివరాలు ఇప్పుడు చూద్దాం.

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తన రెపోరేటును 25బేసిస్ పాయింట్స్ తగ్గించింది. అంటే 6.50 శాతం నుంచి 6.25శాతానికి కుదించింది. దీంతో రుణ గ్రహీతలకు ఈఎంఐ బారం నుంచి మినహాయింపు లభిస్తుంది. కానీ ఎఫ్డీ(FD)లలో ఇన్వెస్టర్లకు వడ్డీ తగ్గిపోతుంది. ఆర్బిఐ నిర్ణయం మేరకు బ్యాంకులు త్వరలో తమ ఎఫ్డీలపై వడ్డీని తగ్గిస్తాయి. ఈ నేపథ్యంలో ముందుగానే ఫిక్స్డ్ డిపాజిట్ స్కీము(Fixed Deposit Scheme)ల్లో డబ్బులు పెట్టడం మంచిది. దీనివల్ల ప్రస్తుతం అమలవుతున్న రేట్లను పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీలపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకులు ఏవో చూద్దాం.

స్మాల్‌ ఫైనాన్స్‌ ‍బ్యాంకులు:

- యూనియన్‌ ‍స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులో 1001 రోజుల డిపాజిట్‌కు 9.5 శాతం వడ్డీని లభిస్తుంది.

-ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులో రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకూ డిపాజిట్లకు 9.1 శాతం వడ్డీ అమలవుతోంది.

-సూర్యోదయ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులో ఐదేళ్ల డిపాజిట్లపై 9.1 వడ్డీ ఇస్తున్నారు.

-ఈక్విటాస్‌ బ్యాంకులో 888 రోజులకు 9 శాతం వడ్డీ అమలవుతుంది.

-ఈఎస్‌ఏఎఫ్‌ బ్యాంకులో (888 రోజులు) 8.88 శాతం, జన ఫైనాన్స్‌ లో (ఏడాది నుంచి మూడేళ్లు ) 8.75 శాతం, ఉజ్జీవన్‌ బ్యాంకులో (12 నెలలు) 8.75 శాతం ఇస్తున్నారు.

ప్రైవేటు రంగ బ్యాంకులు:

-బంధన బ్యాంకులో ఫిక్స్‌ డ్‌ డిపాజిట్లపై ఏడాదికి 8.55 శాతం వడ్డీని అమలు చేస్తున్నారు.

-డీసీసీ బ్యాంకులో 8.55 శాతం వడ్డీని ఇస్తున్నారు.

-ఎస్‌బీఎం బ్యాంకులో 18 నెలల నుంచి రెండేళ్ల కంటే తక్కువ రోజులకు ఎఫ్‌డీలపై 8.75 వడ్డీని ఇస్తున్నారు.

-సౌత్‌ ఇండియన్‌ బ్యాంకులో 18 నెలల డిపాజిట్లపై 7.90 శాతం వడ్డీ ఇస్తున్నారు.

-కర్నాటక బ్యాంకులో 375 రోజులకు 8 శాతం వడ్డీ పొందవచ్చు.

ప్రభుత్వ బ్యాంకులు

-బ్యాంకు ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సిస్‌ బ్యాంకు, యూనియన్‌ బ్యాంకులలో ఎఫ్‌ డీ లపై 7.80 శాతం వడ్డీని పొందవచ్చు.

-బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్రలో 7.95 శాతం వడ్డీని అమలు చేస్తు‍న్నారు.

-పంజాబ్‌, సింధ్‌ బ్యాంకులలో 7.95 శాతం వడ్డీని పొందవచ్చు.

-కెనరా బ్యాంకులో 7.90 శాతం ఇస్తున్నారు.

Next Story

Most Viewed