- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Apple: భారత్‌లోనే ఐఫోన్ లేటెస్ట్ 16ఈ సిరీస్ ఫోన్ల అసెంబ్లింగ్: యాపిల్

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ బుధవారం తన చవకైన ఐఫోన్ మోడల్ 16ఈని విడుదల చేసింది. ఈ మోడల్ కోసం ఫిబ్రవరి 21 నుంచి ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చని, సాధారణ అమ్మకాలు ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే కంపెనీ తన ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో అసెంబింగ్ చేస్తోంది. కొత్తగా విడుదలైన 16ఈ మోడల్ అసెంబ్లింగ్ ప్రక్రియ సైతం స్థానికంగా ప్రారంభించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా భారత్ నుంచే ఈ మోడల్ ఫోన్‌లను ఎగుమతి చేయనున్నట్టు స్పష్టం చేసింది. దీంతో ఐఫోన్ 16ఈతో పాటు మొత్తం ఐఫోన్ 16 సిరీస్ ఫోన్‌లన్నిటినీ భారత విక్రయాలతో పాటు ఎంపిక చేసిన దేశాలకు ఎగుమతి చేయడం కోసం అసెంబుల్ చేయనున్నారు. మరోవైపు యాపిల్ కంపెనీ రిటైల్ అమ్మకాలతో పాటు స్థానికంగా తయారీని మరింత వేగవంతం చేయాలని భావిస్తోంది. ఐఫోన్ ఎస్ఈ తొలి జనరేషన్‌తో మొదలుకొని 2017 నుంచి ఐఫోన్‌లను తయారు చేస్తోంది. అప్పటినుంచి ఐఫోన్ 12,13,14,14 ప్లస్, 15లను అసెంబుల్ చేస్తోంది. ఇటీవల ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ మోడళ్లను మన దేశంలోనే తయారు చేసిన యాపిల్, ఐఫోన్ 16 సిరీస్‌లో ప్రో, ప్రో మ్యాక్స్ లాంటి టాప్ మోడళ్ల తయారీని మొదటిసారి మనదేశంలోనే తయారు చేస్తోంది. తయారీతో పాటు యాపిల్ దేశీయంగా మరిన్ని రిటైల్ స్టోర్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబైలలో స్టోర్లు ఉండగా, త్వరలో ఈ రెండు చోట్ల ఒక్కోటి చొప్పున, బెంగళూరు, పూణెలలో కొత్త స్టోర్లను ప్రారంభించనుంది.