- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Amazon India: 2030 నాటికి భారత్ నుంచి 80 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం: అమెజాన్

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున ఎగుమతులు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు 2030 నాటికి భారత్ నుంచి 80 బిలియన్ డాలర్ల(రూ. 6.8 లక్షల కోట్ల) ఎగుమతులను నిర్వహించాలనే లక్ష్యంతో ఉన్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఎగుమతుల వృద్ధి ద్వారా ఈ ఏడాది చివరి నాటికి 20 బిలియన్ డాలర్ల(రూ. 1.7 లక్షల కోట్ల)కు చేరుకోనున్నామని అమెజాన్ ఎమర్జింగ్ మార్కెట్స్ హెడ్ అమిత్ అగర్వాల్ చెప్పారు. మంగళవారం జరిగిన 'సంభవ్ సమ్మిట్'లో మాట్లాడిన ఆయన.. ఈ లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వంతో పాటు లక్షలాది భారతీయ చిన్న వ్యాపారులు, డీ2సీ బ్రాండ్లతో పాటు ఇతర కీలక భాగస్వాములతో కలిసి పనిచేస్తామన్నారు. 2015 నుంచి అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినప్పటి నుంచి దేశంలోని 200 కంటే ఎక్కువ నగరాల నుంచి 1,50,000 మంది విక్రేతలు నమోదయ్యారు. వారు 2024 చివరి నాటికి రూ. 1.7 లక్షల కోట్ల ఎగుమతులను పూర్తి చేయనున్నారు. భవిష్యత్తుల్లోనూ దీన్ని మరింత విస్తరిస్తూ దేశీయ ఎంఎస్ఎంఈలు, తయారీదారులు, డీ2సీ స్టార్టప్‌ల కోసం అమెజాన్ మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తులను ఎక్కువగా సేకరిస్తుంది. తద్వారా ఎగుమతుల లక్ష్యం సాధ్యమవుతుందని అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ పేర్కొన్నారు.