ఏడాది చివర్లో భారీగా విమానాల ఆర్డర్: ఆకాశ ఎయిర్ సీఈఓ!

by Harish |
ఏడాది చివర్లో భారీగా విమానాల ఆర్డర్: ఆకాశ ఎయిర్ సీఈఓ!
X

బెంగళూరు: కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ ఈ ఏడాది చివర్లో భారీ సంఖ్యలో కొత్త విమానాలను ఆర్డర్ చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఆఖర్లో అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాల నిర్వహణకు అనుగుణంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే బెంగళూరులో లెర్నింగ్ అకాడమీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ వినయ్ దూబే బుధవారం ప్రకటనలో వెల్లడించారు.

ఇప్పటికే ఆకాశ ఎయిర్ 72 విమానాలను ఆర్డర్ చేసింది. వాటిలో 18 డెలివరీ అయ్యాయి. 2023 చివర్లో భారీగా ఆర్డర్ చేయాలని నిర్ణయించాం. అయితే, ఎన్ని విమానాలను ఆర్డర్ చేయనున్నది ఖరారు కానప్పటికీ, కనీసం మూడు అంకెల స్థాయిలో ఆర్డర్ ఉంటుందని వినయ్ దూబే తెలిపారు. అంతేకాకుండా వచ్చే సంవత్సరంలో ఆకాశ ఎయిర్ 300 మంది పైలట్లను నియమించుకోనుంది,

లెర్నింగ్ సెంటర్ కూడా అదే సమయంలో ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. వచ్చే దశాబ్ద కాలంలో ఆకాశ ఎయిర్‌కు కనీసం 3,500 మంది పైలెట్ల అవసరం ఉందని వినయ్ స్పష్టం చేశారు. దేశీయంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌లైన్స్‌గా అవతరిస్తామని, ఇప్పటికే కంపెనీ ఆరు నెలల కార్యకలాపాలను విజయవంతంగా పూర్తి చేసిందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed