- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Afcons IPO: ఆఫ్కాన్స్ ఐపీఓ.. ఒక్కో ఈక్విటీ షేరు ధర ఎంతంటే..?

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వ్యాపార సంస్థ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్(Shapoorji Pallonji Group)కు చెందిన ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (Afcons Infrastructure Ltd) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO) ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market)లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఐపీఓ ద్వారా సుమారు రూ. 5,430 కోట్లను సమీకరించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 25న ప్రారంభమై 29న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు(Anchor Investors) అక్టోబర్ 24నే విండో తేర్చుకోనుంది. ఇదిలా ఉంటే ఆ సంస్థ తాజాగా ఐపీఓ ధరల శ్రేణిని నిర్ణయించింది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 440 నుండి రూ. 463 వరకు ఉండనున్నట్లు తెలిపింది. అలాగే 32 షేర్లను కలిపి ఒక్కో లాట్ సైజుగా నిర్ణయించింది. కాగా ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లో కంపెనీ ప్రమోటర్లు , ప్రమోటర్ గ్రూప్ ఎంటీటీలు 99 శాతం వాటాను కలిగి ఉన్నారు. అయితే ఐపీఓ ద్వారా సమీకరించే నిధులను లోన్స్ కట్టేందుకు, లాంగ్-టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం, నిర్మాణ సామాగ్రి కోసం వినియోగించనున్నట్లు కంపెనీ ఇదివరకే వెల్లడించింది.