- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Adani: అదానీ గ్రూప్ నుంచి మహారాష్ట్రకు 6,600 మెగావాట్ల విద్యుత్
దిశ, బిజినెస్ బ్యూరో: మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (MSEDCL)కి 6,600 మెగావాట్ల విద్యుత్‌ను అదానీ గ్రూప్ సరఫరా చేయనుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు విద్యుత్ కోసం రాష్ట్ర విద్యుత్ సంస్థ టెండర్లు వేయగా, తాజాగా ఈ కాంట్రాక్ట్‌ను అదానీ గ్రూప్ దక్కించుకుంది. మొత్తం విద్యుత్‌లో సోలార్, థర్మల్ కేంద్రాల నుంచి అదానీ సంస్థ విద్యుత్‌ను సరఫరా చేస్తుంది. సోలార్ నుండి 5,000 మెగావాట్లు, థర్మల్ నుండి 1,600 మెగావాట్లను అందిస్తుంది. ఒప్పందం ప్రకారం, 25 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. కాంట్రాక్ట్‌ను గెలుచుకోవడానికి అదానీ పవర్ యూనిట్‌కు రూ. 4.08 కోట్ చేసిందని వర్గాలు తెలిపాయి.
థర్మల్ పవర్‌తో పాటు పునరుత్పాదకత విద్యుత్‌పై మహారాష్ట్ర విద్యుత్ సంస్థ దృష్టి సారించింది. 2028 నాటికి విద్యుత్ డిమాండ్‌లో 32 శాతం సౌర విద్యుత్ ద్వారా తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం, ఈ సంఖ్య 12 శాతం మాత్రమే ఉంది, కాబట్టి 5,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ సేకరణ ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వీలవుతుంది. ప్రైవేటు రంగంలో అదానీ పవర్ 17 GW కంటే ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది, అలాగే, దాని సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 11 GW ఉత్పత్తి సామర్థ్యంతో దేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సంస్థగా ఉంది.