- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మూడు కంపెనీల షేర్లను తాకట్టు పెట్టిన అదానీ గ్రూప్
ముంబై: ఇటీవల అదానీ గ్రూప్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో షేర్ల ధరలు భారీగా క్షీణిస్తున్నాయి. దీంతో రుణాలు ఇచ్చిన సంస్థల ప్రయోజనాల కోసం మూడు కంపెనీల ఆధ్వర్యంలోని అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన SBICAP ట్రస్టీ కోకు షేర్లను తాకట్టు పెట్టింది. దీని ద్వారా లోన్ ఇచ్చిన సంస్థలకు నష్ట భయం ఉండకపోగా, పెట్టుబడిదారుల నమ్మకాన్ని తిరిగి పొందినట్లవుతుందని అదానీ గ్రూప్ భావిస్తోంది. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీలు తమ షేర్లను SBICAP ట్రస్టీ కోకు తాకట్టు పెట్టాయి.
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 0.35 శాతం షేర్లను తాకట్టు పెట్టింది. అంతకుముందు ఉన్న 0.65 షేర్లతో కలిపి మొత్తం తాకట్టు పెట్టిన షేర్లు 1 శాతానికి చేరాయి. అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ 0.11 శాతం షేర్లు తాకట్టు పెట్టగా, పాత షేర్లు 0.44 శాతంతో కలిపి మొత్తం 0.55 శాతానికి చేరాయి. అలాగే, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మొత్తం తాకట్టు పెట్టిన షేర్లు 1.06 శాతానికి చేరాయి. ఇందులో పాతవి 0.68 శాతం, కొత్తవి 0.38 శాతంగా ఉన్నాయి.
ఇటీవల హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల కారణంగా అదానీ షేర్ల ధరలు భారీగా క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలకు దిగుతుండటంతో వారి విశ్వాసాన్ని ఎలాగైనా పొందాలని అదానీ గ్రూప్ తమ కంపెనీల షేర్లను ఇలా తాకట్టు పెట్టి వారి నమ్మకాన్ని తిరిగి పొందాలని భావిస్తోంది. అలాగే, ఇటీవల అదానీ గ్రూప్‌కు చెందిన కొన్ని కంపెనీల షేర్ల ధరలు తిరిగి కోలుకుంటున్న సంకేతాలు చూపిస్తున్నాయి.