- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2-3 ఏళ్లలో రూ. 90 వేల కోట్ల పన్నుకు ముందు లాభాలే లక్ష్యం: అదానీ గ్రూప్!
ముంబై: రాబోయే 2-3 సంవత్సరాల్లో పన్నుకు ముందు లాభాలను(ఎబిటా) 20 శాతం వృద్ధితో రూ. 90,000 కోట్లకు చేర్చాలనే లక్ష్యంతో ఉన్నట్టు అదానీ గ్రూప్ వెల్లడించింది. విమానాశ్రయాలతో పాటు ఇంధన, సిమెంట్, పునరుత్పాదక, రవాణా, లాజిస్టిక్స్, పవర్, ట్రాన్స్‌మిషన్ వంటి అన్ని రంగాల నుంచి మెరుగైన వృద్ధి ఉంటుందని ఆశిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లర్ హిండన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల కారణంగా అదానీ కంపెనీ విలువ భారీగా క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ సమస్యను అధిగమించేందుకు అదానీ గ్రూప్ పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపేందుకు 2.65 బిలియన్ డాలర్ల విలువ రుణాలను తిరిగి చెల్లించిన సంగతి తెలిసిందే.
పోర్ట్‌ల నుంచి లాజిస్టిక్స్ వరకు అన్ని రకాల వ్యాపారాల్లో కంపెనీ కొత్త మౌలిక సదుపాయాల పెట్టుబడులు వచ్చే ఏడాది మెరుగైన రాబడిని అందించగలవని కంపెనీ అభిప్రాయపడుతోంది. ఇప్పటికే అదానీ పోర్ట్ వ్యాపారంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. అలాగే, పునరుత్పాదక, రవాణా రంగాల్లో విజయవంతమైన ప్రాజెక్టులను కంపెనీ కలిగి ఉంది. ఇక, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఇప్పటికే మెరుగైన పనితీరుతో కొనసాగుతోంది.