Jawa: అదిరిపోయే లుక్‌‌తో 2024 జావా యెజ్డీ అడ్వెంచర్.. ధర రూ.2.10 లక్షలు

by Harish |
Jawa: అదిరిపోయే లుక్‌‌తో 2024 జావా యెజ్డీ అడ్వెంచర్.. ధర రూ.2.10 లక్షలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇండియా మార్కెట్లోకి మరో కొత్త మోడల్ బైక్ విడుదల అయింది. దీని పేరు ‘2024 Yezdi అడ్వెంచర్’. ఇది అప్‌డేటెడ్ ఫీచర్స్‌తో లాంచ్ అయింది. పాత దానితో పోలిస్తే ఇప్పుడు మరిన్ని అదనపు ఫీచర్లను అందించారు. ప్రారంభ ధర రూ.2,09,900 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). నాలుగు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. టోర్నాడో బ్లాక్ కలర్ వేరియంట్ ధర రూ. 2.10 లక్షలు. మాగ్నైట్ మెరూన్ ధర రూ. 2.13 లక్షలు. మెరూన్, వోల్ఫ్ గ్రే కలర్ వేరియంట్‌ల ధర రూ. 2.16 లక్షలు.

ఈ బైకులో 334సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను అందించారు. ఇది 29.6 హెచ్‌పీ గరిష్ట పవర్ అవుట్‌పుట్, 29.9 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్ బాక్స్‌ను అందించారు. కొత్త యెజ్డీ అడ్వెంచర్ కొత్త ఫీచర్లతో వచ్చింది. ఫోన్‌ను చార్జింగ్ చేసుకోడానికి USB చార్జర్, బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, రైడర్‌లకు ప్రత్యేక నావిగేట్ వ్యవస్థ, మెరుగైన బ్రేకింగ్ కోసం ABS మోడ్‌ వంటివి ఉన్నాయి.


2024 జావా యెజ్డీ అడ్వెంచర్ బైక్ డిజైన్ వినియోగదారులకు బాగా నచ్చుతుందని, పాత మోడళ్ల కంటే దీనిలో అధునాతన ఫీచర్లతో రైడర్లు సరికొత్త అనుభూతిని పొందుతారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్, KTM అడ్వెంచర్ 250, ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 X వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Next Story