- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎద్దు చేసిన పనికి స్కాట్లాండ్ చీకటైంది!
ఎద్దులు, గేదెలు, ఆవులకు వీపు మీద దురద పెడితే ఏం చేస్తాయి? దగ్గరలో ఉన్న గోడకో, చెట్టుకో, విద్యుత్ స్తంభానికో వీపు రుద్దుకుంటాయి. స్కాట్లాండ్‌లో కూడా ఒక ఎద్దు అలాగే చేసింది. అలా చేయడం వల్ల మొత్తం స్కాట్లాండ్ ఒక రాత్రి మొత్తం అంధకారంలో గడిపింది. ఆ ఎద్దు పేరు రాన్. ఈ విషయాన్ని రాన్ యజమాని హేజెల్ లాటన్ ఫేస్‌బుక్ ద్వారా తెలియజేశారు. సౌత్ లానర్క్‌షైర్ విద్యుత్ విభాగం ఫేస్‌బుక్ పేజీలో హేజెల్ క్షమాపణలు తెలిపారు. అయితే ఆ సమయంలో తన ఎద్దుకు షాక్ కొట్టకుండా ఉన్నందుకు సంతోషంగా ఉన్నప్పటికీ, దాని వల్ల అందరూ ఇబ్బంది పడటం బాధను కలిగిస్తోందని హేజెల్ అన్నారు.
అయితే కరెంట్ పోవడానికి కారణం అర్థంకాక అధికారులు చాలా తికమక పడ్డారు. చివరికి హేజెల్ వాళ్ల పశువుల పాక పక్కనే ఉన్న సబ్‌స్టేషన్ స్తంభానికి ఉన్న పవర్ బాక్స్ పగిలి ఉండటాన్ని హేజెల్ భర్త గమనించాడు. అదే విషయాన్ని అధికారులకు తెలియజేసిన తర్వాత వాళ్లు వచ్చి బాగు చేశారు. కానీ దాదాపు 700ల కుటుంబాలను ఇబ్బంది పెట్టిన తమ ఎద్దుకు ఇక నుంచి రాన్ అని కాకుండా స్పార్కీ అని పేరు పెట్టబోతున్నట్లు హేజెల్ నవ్వుతూ చెప్పింది.