- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ట్యూషన్ పేరుతో ప్రేమ పాఠాలు.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి!
దిశ, కంటోన్మెంట్ : ట్యూషన్ చెప్పేందుకు వచ్చి ప్రేమ పాఠాలు నేర్పించాడు ఓ ప్రబుద్ధుడు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నమ్మిన ఆ యువతి తెగ సంబురపడిపోయింది. తీరా అది నిజం కాదని తెలియడంతో ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించి ఆస్పత్రిలో కొన ప్రాణాలతో పోరాడుతోంది. ఈ ఘటన బోయిన్ పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. న్యూ బోయిన్ పల్లి పరిధి చిన్నతోకట్టలోని తిరుమల టవర్స్ అపార్ట్ మెంట్‌లో నివాసముండే దేవర నర్సింహులు చిరు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన కూతురు శైలజ (23) బీటెక్ చదువుతోంది. ఎదురుగా ఉన్న ఫ్లాట్‌లో నివాసముండే పవన్ కళ్యాణ్ అలియాస్ సన్నీ(25)రోజూ శైలజకు ట్యూషన్ చెప్పేవాడు.
ఈ క్రమంలోనే తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటాని శైలజను నమ్మించాడు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు తెలిపింది. శైలజ తల్లిదండ్రులు సన్నీ పేరెంట్స్‌తో మాట్లాడేందుకు వెళ్లగా, సన్నీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా, కులంపేరుతో దూషిస్తూ తీవ్ర అవమానాలకు గురిచేశారు. కొన్ని రోజుల తర్వాత శైలజ ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చిన సన్నీ ఆమెను తీవ్ర భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు నిన్ను పెళ్లిచేసుకోనని, వేరే అమ్మాయిని చేసుకుంటానని తెలిపాడు. దీంతో శైలజ మానసికంగా కుంగిపోయి తీవ్ర ఒత్తిడికి గురైంది. దీంతో తనకు జరిగిన అవమానం భరించలేక ఎవరూ లేని సమయం చూసి అపార్టుమెంట్ మూడో అంతస్తు నుంచి దూకింది. ఇది గమనించిన వాచ్‌మెన్ లక్ష్మయ్య వెంటనే సరసింహులుకు సమాచారం ఇచ్చాడు.అప్పటికే తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న శైలజను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.