బీఎస్‌ఎఫ్ జవాన్ అరెస్టు..

by Anukaran |   ( Updated:2020-08-02 12:11:39.0  )
బీఎస్‌ఎఫ్ జవాన్ అరెస్టు..
X

దిశ, వెబ్ డెస్క్ :
డ్రగ్స్ కేసులో బీఎస్ఎఫ్ జవాన్‌ను అరెస్టయ్యాడు. పాకిస్థాన్ నుంచి భారత్ కు అక్రమంగా సరఫరా చేస్తున్న మాదక ద్రవ్యాల ముఠాను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా తమకు బీఎస్ఎఫ్‌లో పనిచేసే రాజేంద్ర ప్రసాద్ అనే జవాన్ సాయం చేశారని తెలపడంతో అతనితో పాటు మరో ఇద్దరని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ డ్రగ్స్‌ను పంజాబ్‌లోని తర్న తరన్ అనే జిల్లా నుంచి తరలిస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి చైనా మేడ్ 30 బోర్ తుపాకులు, 5రౌండ్ల బుల్లెట్లు, రూ.24.50లక్షల నగదు, 17కిలోలో హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో సత్‌సమ్ సింగ్ అనే స్మగ్లర్ భారీగా నగుదు ఆశ చూపి తనను అక్రమ రవాణాలోకి లాగినట్లు జవాన్ అంగీకరించాడు. అనంతరం జవాన్ విషయాన్ని ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పంజాబ్ డీజీపీ దినకర్ గుప్తా వెల్లడించారు. కాగా, రాజేంద్రప్రసాద్ అనే జవాన్‌తో పాటు గతంలోనూ ఇదే కేసు విషయంలో మరో జవాన్ అరెస్టయ్యాడు. దీంతో డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన జవాన్ల సంఖ్య రెండుకు చేరిందని పంజాబ్ పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed