- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై ప్రశంసలు
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థకి బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ప్రశంశలు దక్కాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏపీ సర్కారు తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయంటూ హైదరాబాదులో యూకే డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ట్విట్టర్ మాధ్యమంగా అభినందించారు.
ఇప్పటివరకు ఏపీలో ప్రతి 10 లక్షల మందిలో 14,049 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారని, 4.5 లక్షల మందితో కూడిన బలమైన వాలంటీర్ల వ్యవస్థ, 11,158 మంది గ్రామ కార్యదర్శులు, క్వారంటైన్ చర్యల పర్యవేక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న వైనం అమోఘం అని కొనియాడారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని చూసి ప్రపంచమే పాఠాలు నేర్చుకోవాలంటూ ఫ్లెమింగ్ ట్వీట్ చేశారు. ఆంగ్ల మీడియా సంస్థ.. సీఎం జగన్ ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం కృషి చేస్తున్న తీరును ప్రతిబింబిస్తూ ప్రచురించిన కథనాన్ని కూడా షేర్ చేశారు.