బ్రిటానియా త్రైమాసిక లాభం రూ.375 కోట్లు!

by Harish |
బ్రిటానియా త్రైమాసిక లాభం రూ.375 కోట్లు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: 2019-20 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో బిస్కెట్ల తయారీ సంస్థ బ్రిటానియా నికర లాభం రూ.1402.63 కోట్లుగా నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే 21 శాతం వృద్ధి సాధించినట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో సంస్థ పేర్కొంది. గతేడాది రూ. 1159.12 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 5.48 శాతం పెరిగి రూ. 11,878.95 కోట్లకు చేరిందని, గతేడాది ఇది రూ. 11,261.12 కోట్లుగా ఉండేదని తెలిపింది. త్రైమాసిక పరంగా చూస్తే..చివరి త్రైమాసికంలో బ్రిటానియా నికర లాభం రూ. 375 కోట్లతో 26 శాతం పెరిగిందని వెల్లడించింది. త్రైమాసిక ఆదాయం గతేడాది రూ. 2,764 ఉండగా, ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో 2 శాతం పెరిగి రూ. 2,808 కోట్లకు చేరుకుంది. ‘చివరి త్రైమాసికంలో మొదటి రెండు నెలలు వృద్ధి సాధించినప్పటికీ, లాక్‌డౌన్ కారణంగా మార్చి నుంచి వ్యాపారం దెబ్బతిందని బ్రిటానియా ఎండీ వరుణ్ తెలిపారు.

Advertisement

Next Story