- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రిస్బేన్ టెస్టు అనుమానమే..!
దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియా-ఇండియా మధ్య చివరిదైన నాలుగో టెస్టు జరుగనుంది. అయితే గత కొన్ని రోజులుగా టీమ్ ఇండియా క్రికెటర్లు అక్కడ టెస్టు మ్యాచ్ ఆడటానికి సముఖంగా లేరు. క్వీన్స్‌లాండ్ కూడా టీమ్ ఇండియా కోసం నిబంధనలు సడలించలేమని తెలియజేసింది. అయితే అకస్మాత్తుగా క్వీన్స్‌లాండ్‌లో బ్రిటన్ స్ట్రెయిన్ వైరస్ గుర్తించారు. ప్రస్తుతం బ్రిస్బేన్‌లో మూడు రోజుల లాక్‌డౌన్ విధించారు. ఇప్పటికే టీమ్ ఇండియా నిబంధనలను సడలించమని కోరగా.. తాజాగా అక్కడ లాక్‌డౌన్ మొదలైంది. దీంతో టీమ్ ఇండియాకు నిబంధనలు సడలించడం కష్టమే అని తెలుస్తున్నది. మరోవైపు టీమ్ ఇండియా అక్కడి హోటల్ రూమ్‌లలో ఖైదీల్లా ఉండటానికి వ్యతిరేకిస్తున్నారు. దీంతో బ్రిస్బేన్ టెస్టు జరగడం సందిగ్దంగానే మారింది. బీసీసీఐ కూడా టీమ్ ఇండియా ఆటగాళ్లు అందరూ ఒప్పుకుంటేనే బ్రిస్బేన్‌లో టెస్టును కొనసాగించాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో బ్రిస్బేన్ టెస్టు జరుగుతుందా లేదా అనే అనుమానాలకు ఇంకా తెరపడలేదు.