కోటప్పకొండ ఈఓ పోస్టింగ్ పై వివాదం..

by Jakkula Mamatha |   ( Updated:2024-02-13 09:23:32.0  )
కోటప్పకొండ ఈఓ పోస్టింగ్ పై వివాదం..
X

దిశ ప్రతినిధి, గుంటూరు: కోటప్పకొండ పుణ్యక్షేత్రం ఈఓ పదవి పై వివాదం జరుగుతోంది. ఇది దక్షిణ భారతదేశం శైవ క్షేత్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతోంది. ఇప్పటివరకు ఈ పుణ్యక్షేత్రాన్ని పాలనా పరంగా ఈ ఓ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ దేవస్థానం ఈఓ పోస్టును నెల రోజుల క్రితం ప్రభుత్వం ఏ.సి. స్థాయి అధికారి పర్యవేక్షించే పోస్టును అప్గ్రేడ్ చేసింది. సదరు ఈఓ పోస్ట్ పెదకాకాని దేవస్థానం ఈఓ గా పనిచేస్తున్న ఏసి స్థాయి అధికారి నల్లమడ శ్రీనివాసరెడ్డిని కోటప్పకొండ ఈఓ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన చార్జి తీసుకునేందుకు కోటప్పకొండ రాగా ప్రస్తుతం ఈఓ జి.శ్రీనివాసరెడ్డి చార్జి ఇవ్వలేదు. దీంతో కొత్త ఈఓ గా వచ్చిన శ్రీనివాస్ రెడ్డి కు ఏం చేయాలో పాలు పోలేదు.

ప్రస్తుతం ఈఓ ను ఇక్కడ కొనసాగించాలని అధికార పార్టీ నేతలు చార్జి అప్పగించకుండా చేశారని అధికార పార్టీ ,దేవాదాయ శాఖ అధికారవర్గాలు చర్చ జరుపుతున్నారు. మార్చి 8న శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఇక్కడకు వస్తారు. అప్పటి వరకు ప్రస్తుత ఈఓ ను కొనసాగించాలనే పట్టుదలతో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నట్టు తెలిసింది. ఐతే కొత్త ఈఓ నియామకం పై ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారో అని అధికార వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద కోటప్పకొండ ఈఓ పోస్టింగ్ వ్యవహారం వివాదంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed