BREAKING : కేటీఆర్ ఆన్ మిషన్.. లోక్‌సభ నియోజకవర్గాలపై సమీక్షలు

by Shiva |   ( Updated:2024-01-17 02:35:54.0  )
BREAKING : కేటీఆర్ ఆన్ మిషన్.. లోక్‌సభ నియోజకవర్గాలపై సమీక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, బలబలాలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోక్‌సభ నియోజకవర్గాలపై నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవాళ నాగర్ కర్నూల్ సెగ్మెంట్ నేతలతో కేటీఆర్ భేటీ కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే, ఇటీవలే తుంటి ఎముక విరగడంతో ఆసుపత్రి పాలైన కేసీఆర్‌కు వైద్యులు ఆపరేషన్ చేసిన అనంతరం జూబ్లీహిల్స్‌లోని నందినగర్‌లో ఉన్న సొంత ఇంట్లో ఆయన విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకోవడానికి మరో వారం రోజులు సమయం పడుతుంది. కానీ, లోక్‌సభ ఎన్నికలకు ఎక్కువ సమయంలో లేకపోవడంతో ఆయన స్థానంలో కేటీఆర్ లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా ఎన్నికల సన్నాహక సమావేశాలకు హాజరు కాబోతున్నారు.

Advertisement

Next Story