BREAKING : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన..

by Shiva |
BREAKING : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన..
X

దిశ, వెబ్‌డెస్క్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. హైదారాబాద్ నుంచి వారణాసి వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం ఇవాళ ఒంటి గంటలకు వారణాసికి బయలుదేరాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాలతో సాయంత్రం 5 గంటలకు ఫ్లైట్ బయలుదేరుతుందని స్పైస్ జెట్ సిబ్బంది ప్రయాణికులకు అనౌన్స్ చేశారు. కానీ, సమయం 5 గంటలు దాటినా.. విమానం రాకపోవడంతో మళ్లీ ప్రయాణికులు సిబ్బందిని ప్రశ్నించగా సర్వీసును పూర్తిగా రద్దు చేశామని తెలిపారు. దీంతో మండిపడిన ప్రయాణికులు ఎయిర్‌పోర్టు లాబీలో నిరసనకు దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇష్టానుసారంగా విమానాలు రద్దు చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రయాణికుల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉందని సమాచారం.

Advertisement

Next Story