BREAKING: లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ‌కి బిగ్ షాక్.. సీనియర్ నేత, సిట్టింగ్ ఎంపీ సంచలన నిర్ణయం

by Shiva |   ( Updated:2024-03-03 09:10:58.0  )
BREAKING: లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ‌కి బిగ్ షాక్.. సీనియర్ నేత, సిట్టింగ్ ఎంపీ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల మందు అధికార బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. 400 సీట్లతో మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తామని చెబుతున్న ఆ పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ శనివారం విడుదల చేసింది. దీంతో టికెట్ దక్కని కొందరు అసమ్మతి నేతలు తమ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. మరికొందరు పార్టీ నుంచి వైదొలుగుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ డాక్టర్ హర్షవర్ధన్ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఇవాళ ప్రకటించారు. బీజేపీ అధిష్టానం విడుదల చేసిన మొదటి జాబితాలో తన పేరు లేకపోవడం బాధించిందని ఆయన పేర్కొన్నారు. అందుకే తాను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడించారు.

కాగా, హర్షవర్ధన్‌ 1993లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అప్పటి ప్రభుత్వంలో ఆయన రాష్ట్ర ఆరోగ్య శాఖ, విద్య, న్యాయ శాఖ మంత్రిగా పని చేశారు. అదేవిధంగా 1998, 2003, 2008, 2013 ఎన్నికల్లో వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా అదే స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే 2014లో ఆయన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. 2014లో చాందినీ చౌక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ అభ్యర్థి కపిల్ సిబాల్‌పై భారీ మెజారిటీతో విజయం సాధించారు.

అనంతరం ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ కేబినెట్‌లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా 2014 మే 26లో ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా 2017లో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దావే మృతి చెందడంతో ఆయనకు ఆ శాఖల అదనపు బాధ్యతలు అప్పగించారు. 2019లో చాందినీ చౌక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి జై ప్రకాష్ అగర్వాల్‌పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన 2019 మే 30న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి 7 జూలై 2021 వరకు కేంద్ర ఆరోగ్య మంత్రిగా పనిచేశారు

Advertisement

Next Story