రాహుల్ గాంధీ పర్యటనకు బ్రేక్..!

by Shyam |
Rahul Gandhi tour
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ​ఉప ఎన్నికలు రాష్ట్రంలో అత్యంత ఖరీదైనవిగా మారాయని టీపీసీసీ కోర్​ కమిటీ అభిప్రాయపడింది. కాంగ్రెస్​తరుఫున పోటీ చేసే అభ్యర్థిని సెప్టెంబర్​10 వరకు ప్రకటించనున్నట్లు పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​కుమార్​గౌడ్​ ప్రకటించారు. టీపీసీసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్​ ఎన్నికల అభ్యర్థి, వ్యూహంపై చర్చించామని, కరీంనగర్​ జిల్లా నేతల అభిప్రాయం తీసుకున్న తర్వాత అభ్యర్థి ప్రకటన ఉంటుందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాయని, ఓట్ల కోసం వందల కోట్లను ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు.

హుజురాబాద్‌లో త్రిముఖ పోటీ ఉంటుందన్నారు. అదేవిధంగా సెప్టెంబర్ 17 వరకు మరో రెండు దళిత దండోరా సభలను నిర్వహిస్తామని, గజ్వేల్‌లో పెట్టాలా… ఆ నియోజకవర్గంలో ఇంకా ఎక్కడైనా నిర్వహించాలా అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. సెప్టెంబర్​17న దళిత దండోరా ఆఖరి సభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు పార్టీ సీనియర్​నేత మల్లికార్జున ఖర్గే హాజరవుతారని మహేశ్​గౌడ్​వెల్లడించారు. అనంతరం పీసీసీ చీఫ్‌గా సేవలందించిన ఉత్తమ్, పొన్నాలను పార్టీ తరుఫున సన్మానం చేశారు. కాగా దళిత దండోరా సభకు పార్టీ నేత రాహుల్​గాంధీ వస్తారని ముందుగా ప్రకటించినప్పటికీ.. పలు కారణాలతో ఆయన పర్యటన ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. రాహుల్‌కు బదులుగా మల్లికార్జున ఖర్గే రానున్నారు.

Next Story

Most Viewed