- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిలిచిపోనున్న బ్యాంకుల ఆన్‌లైన్ సేవలు..
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోని రెండు ప్రధాన బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి. బ్యాంకు లావాదేవీలు నడిచినా.. ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించాయి. ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ తమ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా ఖాతాదారులను అలర్ట్ చేశాయి. బ్యాంక్ ఆన్‌లైన్ సేవలు కొన్ని గంటల పాటు అందుబాటులో ఉండవని తెలియజేశాయి.
షెడ్యూల్డ్ మెయింటెనెన్స్‌లో భాగంగా ఈ సేవలు నిలిచిపోతున్నాయని వివరించాయి. మే 8న ఉదయం 2 గంటల నుంచి 5 గంటల వరకు నెట్ బ్యాంకింగ్ సహా మొబైల్ బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం కలుగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. అలాగే మే 7వ తేదీ రాత్రి 10.15 గంటల నుంచి మే 8వ తేదీ అర్ధరాత్రి 1.45 గంటల వరకు ఎస్‌బీఐ డిజిటల్ సర్వీసులు పొందలేరని ఎస్‌బీఐ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మూడున్నర గంటల పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సర్వీసులు ఏవీ పని చేయవని బ్యాంక్ కస్టమర్లు గుర్తించుకోవాలని ఆయా బ్యాంకులు కస్టమర్లకు వివరించాయి.