- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సిద్దిపేటలో గేట్ కూలీ బాలుడు మృతి

X
దిశ, సిద్దిపేట: పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. గేటు కూలీ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానిక ఇందిరా నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. లత, స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు హర్ష (9) ఇంటి పక్కన ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు గేట్ దిమ్మ కూలి పోవడంతో గేట్ ఒక్కసారిగా హర్ష మీద పడింది. దీంతో హర్ష అక్కడికక్కడే మృతి చెందాడు. తోటి మిత్రులు కేకలు వేయడంతో హర్ష కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని విగతజీవిగా పడి ఉన్న తన కుమారుడుని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం చిన్నకొడూర్ మండలం చండ్లపూర్‌కు తరలించారు.
Next Story