- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇటీవల భర్త… ఇప్పుడు కొడుకు
by Shyam |

X
దిశ, కోదాడ: భర్త చనిపోయిన విషాదం నుంచి కోలుకోక ముందే ఆమెను మరో విషాదం వెంటాడింది. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం సీతానగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బోనాల యుగంధర్ (5)ను తన తాత సరదాగా ట్రాక్టర్‌పై ఎక్కించుకుని హరితహారం మొక్కలను తీసుకువచ్చేందుకు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా యుగంధర్ కింద పడ్డాడు. దీంతో ట్రాక్టర్ టైర్ యుగంధర్ పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి ఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించింది. తన భర్త చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆమెకు కన్నకొడుకు కూడా దూరమవ్వడం పలువురిని కంటతడి పెట్టించింది.
Next Story