కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారు : బొత్స

by srinivas |
Minister Botsa Satyanarayana
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీ రాజధాని ప్రాంత రైతులకు నిన్ననే వారి అకౌంట్లలో వార్షిక కౌలు, పెన్షన్ డబ్బులు వేశామని, టెక్నికల్ సమస్య వలన అవి ఈరోజు యాడ్ అయ్యాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అయితే, కావాలనే రాజధాని రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొట్టి తమపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని బొత్స విమర్శించారు.

తమ ప్రభుత్వం కౌలు రైతులకు పెన్షన్ రూ.5వేలు పెంచాలనుకున్నదని.. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తున్నందున ఏ నిర్ణయం తీసుకోలేకపోయామన్నారు. ఏపీ ప్రభుత్వం 30లక్షల మంది పేదలకు ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపడుదామని అనుకుంటే.. అడుగడుగునా ప్రతిపక్షాలు అడ్డుకుని తమపై నిందలు వేయడం సరికాదని మంత్రి హితవు పలికారు.

Advertisement

Next Story