- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కోనరావుపేటలో బాంబు కలకలం

దిశ, వేములవాడ: ఒక పక్క చత్తీస్‌ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల అడవి గ్రామంలో బాంబు పేలడంతో ఒక్కసారిగా పోలీసులు ఉలిక్కిపడ్డారు. గ్రామ శివారులోని ఏకలవ్య గురుకుల పాఠశాల సమీపంలో మానాల కు వెళ్ళే దారిలో ఒక్కసారిగా బాంబు పేలింది.
దీంతో భారీ శబ్ధం రావడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పక్కనే స్కూల్ ఉండగా తృటిలో పెను ప్రమాదం తప్పింది. బాంబు స్క్వాడ్ తో పోలీసు బృందం సంఘటన స్థలానికి చేరుకొని బాంబులు తీసే పనిలో పడ్డారు. కాగా ఈ బాంబులు మందుపాతర గా ఎవరికోసం పెట్టారని, ఎప్పుడు పెట్టారు అనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఛత్తీస్ఘడ్ లో ఎన్ కౌంటర్ జరిగి 22 మంది జవాన్లు మృతి చెందిన సంఘటన మరువకముందే, మరోమారు బాంబుతో ఒక్కసారిగా జిల్లా ఉలిక్కిపడింది. ఈ బాంబులు పోలీసుల కోసం పెట్టినవా లేక ఎవరినైనా టార్గెట్ చేసి పెట్టినవా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.