- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాకు కరోనా… ఇదంతా ఫేక్ : షెఫాలీ షా
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ సీనియర్ నటి షెఫాలీ షా తమ కుటుంబంపై వస్తున్న వదంతులను కొట్టిపారేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్‌కు కరోనా సోకిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తన ఫేస్ బుక్ ఎకౌంట్ హ్యాక్ అయిందని… కావాలనే ఎవరో ఈ వార్తను స్ప్రెడ్ చేశారని తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయంపై వివరణ ఇచ్చిన ఆమె… మేమంతా క్షేమంగానే ఉన్నామని చెప్పారు. ఇలాంటి వార్తలను ప్రజలు నమ్మరాదని సూచించారు. ఈ విషయం తెలిసి తమ పట్ల ప్రేమ, గౌరవంతో కాల్ చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపిన షెఫాలీ …. అసలు ఈ పోస్ట్ ఎందుకు, ఎవరు పెట్టాల్సి వచ్చిందో తెలియడం లేదన్నారు. కాగా సోమవారం తన ఫేస్ బుక్ ఎకౌంట్ నుంచి షెఫాలీ కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ అనే పోస్ట్ వచ్చింది.
కాగా… బాలీవుడ్‌లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారించబడిన తొలి సెలబ్రిటీ కనికా కపూర్ హాస్పిటల్‌లో చికిత్స అనంతరం పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంది. కానీ ప్రస్తుతం ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ నిర్మాత కరీమ్ మొరానీతో పాటు తన ఇద్దరు కూతుళ్లు షాజా మొరానీ, జోయా మొరానీలు కొవిడ్ 19తో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
Tags: Shefali Shah, Corona, CoronaVirus, Covid 19, Bollywood