జోరు వానలో.. బొగత అందాలు చూడతరమా..

by Shyam |   ( Updated:2021-07-13 21:55:05.0  )
జోరు వానలో.. బొగత అందాలు చూడతరమా..
X

దిశా వాజేడు : బొగత జలపాతం పరవళ్లతో అటవీ ప్రాంతం హోరెత్తుతోంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు కనివిందు చేస్తున్నాయి. జలపాతాల పరవళ్లతో ఆ అడవి తల్లి మురిసిపోతోంది.

ములుగు జిల్లా పరిధిలోని ఏటూరునాగారం కన్నాయిగూడెం వాజేడు వెంకటాపురం మండలాల్లో గత రెండు రోజులుగా జోరుగా వర్షం కురుస్తుంది. దీంతో గోదావరిలోకి భారీగా వరద నీరు చేరడంతో వెలవెలబోయిన గోదావరి ఒక్క సారిగా జలకళ వచ్చిపడింది. కాలేశ్వరం లక్ష్మీ బ్యారేజి నుండి 96 వేల క్యూసెక్కుల వాటర్ విడుదల చేయడంతో తుపాకులగూడెం, సమ్మక్క బ్యారేజ్ 24 గేట్లు ఎత్తివేయడంతో.. వాజేడు మండలం పూసురు బ్రిడ్జి వద్ద గోదావరి నిండుగా ప్రవహిస్తుంది.

తుపాకుల గూడెం సమ్మక్క బ్యారేజ్ లోకి ఇన్ఫ్లో ఎంత అయితే నీరు వస్తుందో అంతే నీటిని అవుట్ ఫ్లో విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వరద నీరు వలన క్రమేపీ గోదావరి పెరుగుతూ పేరూరు వద్దా 20 అడుగులకు చేరుకుంది. వాజేడు మండలం‌లో మంగళవారం ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి బొగత జలపాతం నిండుగా ప్రవహిస్తూ ఉంది. ఏజెన్సీ ప్రాంతంలోని వాగులు వంకలు నిండుగా ప్రవహిస్తూ వర్షపు నీటితో కళకళలాడుతున్నాయి. ఉదయం నుండి ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఎవరు బయటకు తిరుగక రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.

Advertisement

Next Story

Most Viewed