- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా బోగాల శ్రీనివాసరెడ్డి..
దిశ, భద్రాచలం: పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షునిగా భద్రాచలం పట్టణానికి చెందిన బోగాల శ్రీనివాసరెడ్డి నియమితులైనారు. గురువారం భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో గల సిటీ స్టైల్ జిమ్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. మల్లేష్ చేతులమీదుగా శ్రీనివాసరెడ్డి నియామక పత్రాన్ని అందుకున్నారు. జనరల్ సెక్రటరీగా వి.మల్లేష్, కోశాధికారిగా జి.వి.రామిరెడ్డి, ఉపాధ్యక్షులుగా లాయర్ తిరుమలరావు, కె.కృష్ణారావు, జాయింట్ సెక్రటరీగా ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా లక్ష్మణ్, రాసమళ్ళ రాములు నియామక పత్రాలు అందుకున్నారు.
ఈ సందర్భంగా వి. మల్లేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాలలో 2 శాతం స్పోర్ట్స్ కోటాలో క్రీడాకారులకి రిజర్వేషన్ ఉందని, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా అధ్యక్షులు బోగాల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. నేటి యువత పెడత్రోవలు పట్టకుండా, చెడు అలవాట్లకి దూరంగా ఉంటూ, ప్రతి రోజూ కనీసం ఒక గంట సేపు వ్యాయామం చేయాలని, ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం పట్టణంలో జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలని అతి త్వరలో నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిటీ స్టైల్ జిమ్ నిర్వాహకులు జి.వి.రామిరెడ్డి, పూనెం వీరభద్రం, లాయర్ తిరుమలరావు, పూనెం కృష్ణ, ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి, అన్నెం వెంకటేశ్వరరెడ్డి, శీలం రామ్ మోహన్ రెడ్డి, గాలి రామ్మోహన్ రావు, టి.పూర్ణ, రాసమళ్ళ రాము, సిటీ స్టైల్ జిమ్ విద్యార్థులు పాల్గొన్నారు.