- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సోనూసూద్‌పై పోలీసులకు బీఎంసీ ఫిర్యాదు

X
దిశ, వెబ్‌డెస్క్: నటుడు సోనూసూద్‌పై ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబైలోని జుహులోని ఆరు అంతస్తుల నివాస భవనాన్ని అనుమతులు లేకుండా హోటల్‌గా మార్చారని సోనూసూద్‌పై ఆరోపించింది. మహారాష్ట్ర రీజియన్ అండ్ టౌన్ ప్లానింగ్ (ఎంఆర్‌టీపీ) చట్టం ప్రకారం నేరంగా పేర్కొంటూ బీఎంసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై సోనూసూద్ స్పందిస్తూ.. భవనానికి అన్ని అనుమతులు ఉన్నాయని.. తాను ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, హోటల్‌గా మార్చేందుకు తన వద్ద బీఎంసీ అనుమతులు ఉన్నాయని, ఎంసీజెడ్‌ఎంఏ రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఎంసీజెడ్‌ఎంఏ అనుమతి కొవిడ్ కారణంగా రాలేదన్నారు. కరోనా మహమ్మారి సమయంలో కొవిడ్ యోధులను ఉంచేందుకు ఈ హోటల్ వినియోగించినట్లు చెప్పారు. అనుమతులు రాకపోతే, భవనాన్ని తిరిగి నివాసంగా మారుస్తానని స్పష్టం చేశారు.
Next Story