- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మరో రూ. 30 కోట్ల నగదు స్వాధీనం.. హెటిరో డ్రగ్స్ సంస్థలో బ్లాక్ మనీ కలకలం
దిశ, తెలంగాణ బ్యూరో: హెటిరో డ్రగ్స్ సంస్థలో లాకర్లను వెదికినా కొద్దీ నల్లధనం, నోట్ల కట్టలు బైటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా 50 చోట్ల సోదాలు, 16 లాకర్లలో తనిఖీ చేసినప్పుడు రూ. 142 కోట్ల నోట్ల కట్టలు బైటపడగా తాజాగా మరో రూ. 30 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ పేర్కొన్నది. నగరంలోని సికింద్రాబాద్, అమీర్‌పేట్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లోని బ్యాంకు లాకర్లలో ఒక్కో అల్మారాలో సగటున కోటిన్నర రూపాయల చొప్పున బైటపడ్డట్లు తేలింది. ఆరు రోజుల పాటు జరిపిన సోదాల్లో మొత్తం రూ. 172 కోట్ల నగదు, దాదాపు రూ. 550 కోట్ల మేర నల్లధనం వివరాలు లభ్యమయ్యాయి. ఇదిలా ఉండగా ఈ నెల 20వ తేదీలోగా హాజరుకావాల్సిందిగా ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
బైటపడిన నల్లధనంతో పాటు సంస్థకు సంబంధం లేని వ్యక్తిగత లావాదేవీలకు సైతం డబ్బు వినియోగించినట్లు పలు ఆధారాలు లభ్యమైనట్లు సీబీడీటీ (సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) పేర్కొన్నది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు భూముల కొనుగోళ్ళకు కూడా భారీ స్థాయిలో డబ్బులు వెచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు వీటిపైన ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. లెక్కల్లోకి రాకుండా భారీ మొత్తంలో డబ్బులు బైటపడడంతో ఐటీ అధికారులు అన్ని కోణాల నుంచి ఆరా తీస్తున్నారు. భూముల లావాదేవీలకు సంబంధించి రియల్ ఎస్టేట్ సంస్థలను కూడా ఐటీ అధికారులు ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. ఆ సంస్థల ఆదాయ వ్యయాల వివరాలను కూడా పరిశీలించే అవకాశం ఉన్నది.