- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్ జిల్లాలో బ్లాక్ ఫంగస్ పంజా
దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణలో కొత్తగా బ్లాక్ ఫంగస్ వైరస్ కేసులు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తుండగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నాలుగు కేసులు బయట పడటం, వైరస్ కారణంగా ఇద్దరి మరణం కలకలం రేపుతోంది. కరోనా సెకండ్ వేవ్ నియంత్రణకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించి థర్డ్ వేవ్‌ను ఎదుర్కునేందుకు సమాయాత్తం అవుతుండగా బ్లాక్ ఫంగస్ కేసులు కలవరపాటులకు గురి చేస్తున్నాయి. కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడంలో అధికారయంత్రాంగాలకు తల ప్రాణం తోకలోకి వస్తుంటే కొత్తగా బ్లాక్ ఫంగస్ కేసులు బహిర్గతం కావడం అధికార యంత్రాంగాలకు, వైద్యారోగ్య శాఖకు కంటిమీద కునుకులేని చేస్తుంది.
సోమవారం నిజామాబాద్ నగరంలోని సరస్వతినగర్‌కు చెందిన వివాహితకు స్కానింగ్ చేయడంతో బ్లాక్ ఫంగస్ లక్షణాలు వెలుగు చూశాయి. ఇటీవల నిజామాబాద్‌కు చెందిన వ్యక్తి కొవిడ్ సోకి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. సదరు వ్యక్తికి కరోనా పాజిటీవ్ కన్న ముందుగా షుగర్, బిపి లాంటి ఇతర రుగ్మతులు ఉన్నాయి. అతడు త్వరగా కోలుకునేందుకు ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది అధిక మొత్తంలో స్టెరాయిడ్స్‌ను వినియోగించారు. ఆసుపత్రి నుంచి కోలుకొని ఇంటికి చేరిన సదరు వ్యక్తి మూడవ రోజు బ్లాక్ ఫంగస్ బారిన పడటంతో హైదరాబాద్‌లో చికిత్స పోందుతున్నాడు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని గ్రామానికి చెందిన వ్యక్తి కరోనా పాజిటివ్ రావడంతో హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పోందుతున్నాడు. అతడికి శ్వాస ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాద్‌లో చికిత్స చేయించారు.
అక్కడ నుంచి కోలుకుని వచ్చిన మూడు రోజులకు అతడి పండ్లు ఉడిపోయాయి, నిజామాబాద్‌లో ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించగా అవి బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా గుర్తించి హైదరాబాద్ తరలించడంతో అక్కడ చికిత్స పోందుతున్నాడు. బాన్సువాడ పట్టానికి చెందిన వ్యక్తికి గత నెలలో కరోనా రాగా నిజామాబాద్‌లో చికిత్స పోంది కోలుకుంటున్న సమయంలో అతడి ఆరోగ్య పరిస్థితి క్షిణీంచడంతో హైదరాబాద్‌కు తరలించగా బ్లాక్ ఫంగస్‌గా గుర్తించి వైద్యం చేస్తున్నట్లు తెలిసింది. అదివారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గిద్ద గ్రామానికి చెందిన అంజల్ రెడ్డి బ్లాక్ ఫంగస్‌తో చికిత్స పోందుతు చనిపోయాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఎల్‌కే ఫారంకు చెందిన హరిబాబు సోమవారం తెల్లవారు జామున బ్లాక్ ఫంగస్ తో గాంధీ ఆసుప్రతిలో చికిత్స పోందుతూ మరణించాడు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 63 వేలు దాటాయి. నిత్యం వందల కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు కొవిడ్-19 మరణాలు బహిర్గత పరచలేదు కాని అవి వందల్లో ఉండే అవకాశం ఉంది. ఒకపక్క ఏప్రిల్ మాసంలో జీజీహెచ్ మరణాలు మూడంకేలు అంటే అతిశయోక్తికాదు. కేవలం కరోనా మరణాలు ప్రజలను భయకంపితులను చేస్తుంటే కరోనా సోకి కోలుకున్న మూడు నాలుగు రోజుల తర్వాత స్టైరాయిడ్స్ వాడిన బాధితులకు మ్యూకర్ మైసోసిన్ ( బ్లాక్ పంగస్) లక్షణాలు మొదడు, కళ్లు, పండ్ల పై ప్రభావం చూపుతున్నాయి. కరోనాను కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను సద్వినియోగం చేసుకుంటు, జ్వర సర్వేను ఇంటింట చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ముంగిట బ్లాక్ ఫంగస్ కొత్త కేసులు సవాల్ విసురుతున్నాయి.
ఇటీవల టెస్టులు తగ్గాయి, ఫీవర్ సర్వేలో లక్షణాలు ఉన్నవారు పెరుగడంతో వారికి ఉన్న ఫళంగా కిట్‌లను అందచేసి అవసరమైన వారికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందచేస్తున్నారు. కొత్తగా కేసులు నిత్యం 500 లోపు నమోదు అవుతుంటే కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టిందని వైద్య ఆరోగ్యశాఖ అనందపడుతుంటే పిడుగు లాగా బ్లాక్ ఫంగస్ కేసులు బహిర్గతం కావడం మింగుడు పడటం లేదు. కొత్తగా బ్లాక్ ఫంగస్ కేసులు ఈఎన్‌టీ లు, డెంటిస్టులు, అప్తాల్మాజిస్టుల వద్ధ ప్రైవేట్ దవాఖానాలలో వెలుగు చూడటంతో అధికారికంగా లెక్కలు లేకుండా పోతున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఎంతమందికి బ్లాక్ ఫంగస్ వచ్చిందని అధికారులు నిర్ధారించడం లేదు.