‘బీజేపీ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి’

by Ramesh Goud |
‘బీజేపీ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి’
X

దిశ, హైదరబాద్: బీజేపీ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్ విమర్శించారు. ఢిల్లీ అల్లర్లపై తమ నాయకురాలు సోనియాగాంధీ రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేశారనడం దారుణమనీ, అల్లర్లను పక్కదోవపట్టించేందుకే బీజేపీ నాయకులు ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అల్లర్లకు కారణమైన బీజేపీ కార్యకర్తలపై కేసు పెట్టాలని డిమాండ్ చేసిన న్యాయమూర్తి మురళీధరన్‌ను కావాలనే బదిలీ చేశారని ఆరోపించారు. బీజేపీ నేత అనురాగ్ ఠాగూర్.. ‘గోలీమారో’ అంటూ విద్వేశపూరిత నినాదాలు చేసినా.. ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అల్లర్లపై అంతర్జాతీయ మానవహక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. కాగా, ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 43మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Next Story