- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దక్షిణ తెలంగాణ ఏడారిగా మారే ప్రమాదం: బండి
దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణా జలాలు ఏపీ సర్కార్ దోచుకుపోతే దక్షిణ తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వ్యక్తిగత లబ్దికోసం కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నారని, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై ఏపీ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన దీక్ష చేపట్టారు. కృష్ణాజలాల్లో తెలంగాణ వాటా 299టీఎంసీలను పూర్తిగా వినియోగించుకోవడంలో టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు.
పోతిరెడ్డిపాడు అంశంపై ఏపీ సర్కార్ జారీ చేసిన జీవోపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. ఏపీ చేపట్టే ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతం ఏడారిగా మారుతుందని, దీనిపై విచారణ జరిపి రెండ్రోజుల్లో వాస్తవాలను వివరించాలని కృష్ణా రివర్ బోర్డును ఆదేశించాలని లేఖలో కోరారు.