గోమూత్రం తాగమన్న బీజేపీ ఎమ్మెల్యే .. ఎందుకో తెలుసా?

by Shamantha N |
గోమూత్రం తాగమన్న బీజేపీ ఎమ్మెల్యే .. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలో కరోనా విలయతాండవం చేస్తుంది. కరోనా మూలాన ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే కరోనా నుంచి తప్పించుకోవడానికి ఎంతో మంది ఎన్నోరకాల చిట్కాలు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఈ రసం తాగితే కరోనా రాదు.. ఈ ఆకులు తింటే కరోనా పోతదని ఎంతో మంది సామాజిక మాధ్యమాల ద్వారా చెప్తున్నారు. ఈనేపథ్యంలో ఓ ఎమ్మెల్యే కూడా కరోనా రాకుండా ఉండడానికి చిట్కాచెప్పాడు ప్రస్తుతం ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కరోనా రాకుండా ఉండాలంటే గోవు మూత్రం తాగాలని యూపీ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కరోనా బారిన పడకుండా ఉండాలంటే రోజు ఉదయం గోమాత్రం తాగాలని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. తాను రోజు ఉదయం చల్లటి నీటిలో ఐదు మూతల గోమూత్రం వేసి పరిగడుపున తాగుతానని అందుకే ఆయనకు కరోనా సోకడంలేదన్నారు. బల్లియా నియోజకవర్గ ప్రజలకు తాను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను కరోనా బారిన పడకుండా ఉండడానికి తప్పని సరిగా అందరూ గోమూత్రం తాగాలని ఆయన సూచించారు.

Advertisement

Next Story