- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీపీ సజ్జనార్‌కు రాజాసింగ్ మరో సవాల్
దిశ, వెబ్‌డెస్క్: సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సజ్జనార్ గారు ఈ మధ్యన మీరు ఎక్కువగా కామెంట్లు చేశారు.. ముందుగా పొలిటికల్ లీడర్లు చెప్పే మాటల మీద ఎంక్వైరీ చేయండి.. కానీ, మీ పైన ఉండే అధికారులు, టీఆర్ఎస్ అధికారులు చెబితే మీరు మీడియా ముందుకొచ్చి కామెంట్లు చేశారు.. నేను గతంలో కూడా ఇల్లీగల్‌గా ఆవులు మీ లిమిట్స్ నుంచి సిటీకి వస్తున్నాయని చెప్పాను. అందులో కొన్ని బండ్లను స్వయంగా పట్టుకున్నాను కూడా.. ప్రస్తుతం బహదూర్‌పుర నుంచి సైబరాబాద్‌కు రోజూ 30 నుంచి 40 వాహనాల్లో ఆవులు, ఎద్దులు, దూడెలు తరలించి.. కోసేస్తున్నారు. దీనిపై కమిషనర్‌గా మీరు చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు చేపట్టి అరెస్ట్ చేయండి.. మీతోని కాకపోతే.. అంటే నేను ఆ మాట చెప్పలేను.. వేరే వాళ్లు ఉంటే చెప్పొచ్చు.. ‘మీతో చేతకాకపోతే నాకు చెప్పు’..కానీ మీరు కమిషనర్ కదా..నేను మీకు చెప్పలేను.. కానీ మిమ్మిల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను కమిషనర్ గారు.. చెక్‌పోస్టులు పెట్టి ఆ బండ్లు ఆపండి.. ఆవులను కోస్తున్నవారిపైన చట్టప్రకారం చర్యలు తీసుకోండి కమిషనర్ గారు.. లేదు మాకు ఎంఐఎం, టీఆర్ఎస్ నుంచి ఒత్తిడి ఉంది.. ఆవులను కోస్తుంటే ఆపొద్దని ఆదేశాలు ఉంటే.. ఈ రోజు డేట్ మీరు రాసుకోండి.. సరిగ్గా ఐదు రోజుల తర్వాత మళ్లీ నేను రోడ్డు పైనకు వస్తాను..ఎన్ని బండ్లు వస్తే అన్ని బండ్లు పట్టుకొని.. తెలంగాణ ప్రజల ముందు పెడుతా..మీ ఆఫీసుకు తీసుకొచ్చి మరీ తెలంగాణ ప్రజల ముందు పెడుతా.. అప్పుడు మీరు తెలంగాణ ప్రజలకు సమాధానం ఇవ్వాలి.. పొలిటికల్ లీడర్లకు కాదు’.. అంటూ రాజాసింగ్ చెప్పుకొచ్చారు.