- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘తెలంగాణలో బీజేపీ అందుకోసమే పని చేస్తోంది’
దిశ, వేములవాడ: దళితుల పట్ల సీఎం కేసీఆర్ కర్కశంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్య అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలో జాతీయ, రాష్ట్ర స్థాయి ఎస్సీ మోర్చా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లాల్‌సింగ్ ఆర్య మాట్లాడుతూ.. తెలంగాణలో దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ మోసం చేసి గద్దెనెక్కారని విమర్శించారు. అనంతరం వారి పట్ల వివక్ష ప్రదర్శించారని.. రానున్న రోజుల్లో కేసీఆర్‌ను గద్దె దించేందుకు బీజేపీ పోరాటం చేస్తోందన్నారు.
అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే వచ్చిందా.. అంటూ ప్రశ్నించారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి.. ఆయన ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటే.. 2023లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. బహిరంగ సభ అనంతరం వేములవాడ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు బీజేపీ నేతలు. రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొప్పు భాషా నిర్వహించిన ఈ కార్యక్రమంలో లాల్ సింగ్ ఆర్య, జాతీయ ప్రధాన కార్యదర్శి శంభునాథ్ షుండియా, బండి సంజయ్, అన్ని జిల్లాల ఎస్సీ మోర్చా అధ్యక్షులు, తదితర బీజేపీ నేతలు పాల్గొన్నారు.