ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ నేతలు

by Sridhar Babu |   ( Updated:2021-12-21 03:51:00.0  )
Exise-Department-1
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని మంగళవారం భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. ఇటీవల జరిగిన మద్యం దుకాణాల టెండర్లలో టీఆర్ఎస్ యేతర పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల దుకాణాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు అదే పనిగా దాడులు చేస్తూ, కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఫిర్యాదులతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని ముట్టడించి ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వీర బ్రహ్మచారి మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది టీఆర్ఎస్ కార్యకర్తలుగా మారారని విమర్శించారు.

టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, సానుభూతి పరులకు బాసటగా నిలుస్తున్న ఎక్సైజ్ శాఖ సిబ్బంది, అధికారులు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది ధోరణి మార్చుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed