- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్రీవ్యాక్సిన్ ప్రకటన.. మోడీకి పాలాభిషేకం
దిశ, పటాన్ చెరు: కేంద్ర ప్రభుత్వం దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ అందజేస్తుందని బీజేపీ రాష్ట్ర నాయకులు, పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే టి.నందీశ్వర్ గౌడ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం పటాన్ చెరు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వామ వివేకానంద విగ్రహం వద్ద ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు టి.నందీశ్వర్ గౌడ్ హాజరైనారు.
ఈ సందర్భంగా నందీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో ప్రతిఒక్కరికి ఉచితంగా వాక్సిన్ కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి దీపావళి వరకు ఉచితంగా బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం సహసోపేతమైన నిర్ణయమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం పంపించిన వాక్సిన్, కరోనా ఔషదాలు ప్రజలకు పంపిణీ చేయకుండా వ్యాపారం చేస్తున్నారని, అందువల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు.