- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మంత్రి కేటీఆర్‌కు బీజేపీ నేత లక్ష్మణ్ సవాల్
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని విషాద నగరంగా మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ప్రతీ ఇంటికి మంచినీళ్ళేమోగానీ అన్ని ఇండ్లకూ బురదనీటిని సరఫరా చేశారన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిందేమీ లేదంటున్న కేటీఆర్‌కు లెక్కలన్నీ చెప్తామని, చర్చకు ఆయన సిద్ధమేనా అని సవాలు విసిరారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
ఇంటికో ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు తన ఇంటిలోనివారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని, ఎంట్రన్స్ పరీక్షలో ఫెయిల్ అయినా మేనేజ్‌మెంట్ కోటా కింద ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. బీజేపీకి రాష్ట్రం నుంచి నలుగురు ఎంపీలున్నా కేంద్రం నుంచి తెచ్చిందేమీ లేదని చేసిన ఆరోపణలను కేటీఆర్ రుజువు చేయాలని లేదంటే ఎంత ఇచ్చామో తామే లెక్కలు బయట పెడుతామన్నారు.