ప్రజలకు మేము ఏం సమాధానం చెప్పాలి.. బీజేపీ కార్పొరేటర్ల ఆవేదన

by Shyam |
BJP corporators
X

దిశ, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగర ప్రజలు తమను అభివృద్ధి చేస్తామన్న నమ్మకంతో ఎన్నుకున్నారని, నిధులు కేటాయించకుంటే అభివృద్ధి ఎలా చేయాలని, తాము ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని బీజేపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. వెంటనే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కోరుతూ సోమవారం మేయర్‌కు వినతి పత్రం సమర్పించేందుకు మరోసారి ప్రధాన కార్యాలయానికి వచ్చారు. మేయర్ అందుబాటులో లేకపోవడంతో కౌన్సిల్ సమావేశం నిర్వహణకు చర్యలు చేపట్టాలని కోరుతూ కమిషనర్ లోకేష్ కుమార్‌కు అందజేశారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం ఒక్కసారి మాత్రమే సమావేశం జరిగిందని, ప్రతిరోజూ తమకు సమస్యలు చెప్పే ప్రజలకు తాము ఏ మొఖం చూపిస్తామని వాపోయారు. డివిజన్లలో అభివృద్ధి పనులు చేసుకోవడానికి తమకు వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు వెంటనే మేయర్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని, లేనిపక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Next Story

Most Viewed