- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ నేతలు గూండాల్లా ప్రవర్తించారు : క్రాంతికిరణ్
దిశ, వెబ్‌డెస్క్ : దుబ్బాక ఉపఎన్నికకు రేపు పోలింగ్ జరగనుండగా, సోమవారం రాత్రి వేళ బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలు బాహబాహీకి దిగారు. స్వర్ణ ప్యాలెస్‌లోనికి వెళ్లిన బీజేపీ నేతలను టీఆర్‌ఎస్ నేతలు అడ్డుకోవడంతో గొడవ చెలరేగింది. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట జరిగింది. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే వీరేశం, ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఘటనా స్థలిలోనే ఉన్నారు. ఈ సందర్భంగా ఆందోల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీజేపీ నేతలు గూండాల్లా ప్రవర్తించారని, దళిత ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని చెప్పుకొచ్చారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా శాంతి భద్రతల సమస్య సృష్టించాలని చూశారని ఆరోపించారు. తమ వద్ద డబ్బులు ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ నేతలు దూది శ్రీకాంత్ రెడ్డి, కలాల్ శ్రీనివాస్, పత్రి శ్రీనివాస్‌తో పాటు తమ కార్యకర్తలపై దాడి చేశారని చెప్పారు.
ఇదిలాఉండగా, టీఆర్‌ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నాని సమాచారం రావడంతోనే తాము స్వర్ణ ప్యాలెస్‌కు వెళ్లినట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. అయితే, మమ్మల్ని లోనికి వెళ్లకుండా టీఆర్‌ఎస్ నేతలు అడ్డుకుని తమపై దాడికి పాల్పడ్డారని కమలం నేతలు చెబుతున్నారు.