- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తన ఇంట్లోనే మనిషిని బంధించిన పక్షి.. వీడియో వైరల్
దిశ, ఫీచర్స్ : మనిషిని బంధించిన ఒక పక్షి.. అతడు కాలు బయటపెట్టేందుకు ప్రయత్నిస్తే అరుపులతో భయపెడుతోంది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం ఇంటి నుంచి అడుగైనా కదపలేని స్థితిలో ఉన్నట్లు తెలిపిన బాధితుడు. ఒకవేళ ప్రయత్నించినా ‘బష్ స్టోన్ కర్లీ’గా పిలువబడే ఈ విహంగం భయంకరమైన అరుపులతో బెదిరిస్తోందని చెప్తున్నాడు. ఇంతకీ ఆ పక్షి ఎందుకిలా చేస్తుందో తెలుసా? అతని ఇంటి బ్యాక్ యార్డ్‌లో దాని పార్ట్‌నర్ ఉందని, తమ ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది తలెత్తరాదనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తోందని భావిస్తున్నారు. కాగా ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపించే ఈ పక్షి.. సహజంగానే సమీప గూళ్లలోని వేటాడే జంతువుల దృష్టి మరల్చేందుకు రెక్కలు విప్పి శబ్దాలు చేస్తుంటుంది. అలాగే సదరు వ్యక్తి వల్ల తన పార్ట్‌నర్‌కు ప్రాణాపాయం ఉంటుందనే భయంతోనే అతడిని ఇంట్లో బంధించిందని చెబుతున్నారు.
కాగా 2017లోనూ ఇలాంటి పక్షి ఒకటి.. తన ఓన్ రిఫ్లెక్షన్‌తో లవ్‌లో పడిన వీడియో మరోసారి వైరల్ అవుతోంది. క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ కెల్విన్ గ్రోవ్ క్యాంపస్‌లోకి ఎంటరైన బష్ స్టోన్ కర్లీ.. మిర్రర్‌లో తన ప్రతిబింబాన్ని చూసి తనే మురిసిపోయింది. పదే పదే అదే కిటికీ దగ్గరికొచ్చి తన రిఫ్లెక్షన్‌ను చూసుకోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటి నుంచి ఈ పక్షిపై ఆన్‌లైన్ మీమ్స్ పెరిగిపోయాయి.