- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్షీణించిన బయోకాన్ లాభం
దిశ, వెబ్‌డెస్క్: ఆర్ అండ్ డీ విభాగానికి అధికంగా ఖర్చవడం, ఫారెక్స్ నష్టాల కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ ఫార్మా దిగ్గజం బయోకాన్ (Biocon) నికర లాభం 22 శాతం క్షీణించి రూ. 169 కోట్లకు చేరుకున్నాయని వెల్లడించింది. జెనరిక్స్, బయోసిమిలర్, పరిశోధనా సేవల వ్యాపారాల్లో వృద్ధి కారణంగా బయోకాన్ మొత్తం ఆదాయం 10 శాతం పెరిగి రూ. 1,760 కోట్లకు చేరుకుందని రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో పేర్కొంది.
సమీక్షించిన త్రైమాసికంలో బయోసిమిలర్స్ ఆదాయం 11 శాతం, పరిశోధనా సేవలు 12 శాతం, జెనరిక్స్ వ్యాపారం 8 శాతం వృద్ధి సాధించినట్టు కంపెనీ తెలిపింది. అధిక ఆర్ అండ్ డీ ఖర్చులు, సిబ్బంది ఖర్చులు, ఇతర ఖర్చులు, ఫారెక్స్ నష్టాల కారణంగా సంస్థ లాభదాయకతపై ప్రభావం పడిందని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్(Exchange filing)లో తెలిపింది. అయినప్పటికీ ప్రధాన ఎబిటా మార్జిన్లు 32 శాతంతో మెరుగైన పనితీరును సూచిస్తున్నాయని బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్శన్ కిరణ్ మజుందార్ షా చెప్పారు.
విలువ పరంగా జెనరిక్స్ విభాగం(Department of Generics) రూ. 599 కోట్లకు చేరుకోగా, బయోసిమిలర్స్(Biosimilars) ఆదాయం రూ. 676 కోట్లు, పరిశోధనా సేవల విభాగం రూ. 520 కోట్లకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది. ‘ భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారిని పరిష్కరించడంలో నిబద్ధతను పాటిస్తూ బయోకాన్ (Biocon) గ్రూప్ తీవ్రమైన కొవిడ్-19 బాధితులకు తేలికపాటి చికిత్స కోసం ఉత్పత్తుల కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం’ అని కిరణ్ మజుందార్ షా అన్నారు.