Bigg Boss 7 Telugu: కన్నీరు పెట్టిస్తున్న నయని ఎలిమినేషన్.. శోభాశెట్టిని తప్పించడానికే ఇలా చేసారా..?

by Prasanna |   ( Updated:2023-10-16 06:56:34.0  )
Bigg Boss 7 Telugu: కన్నీరు పెట్టిస్తున్న నయని ఎలిమినేషన్.. శోభాశెట్టిని తప్పించడానికే ఇలా చేసారా..?
X

దిశ,వెబ్ డెస్క్: బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ప్రతి యొక్కరు చెప్పే మాట ఏంటంటే.. ‘మేం జనాల మనసుల్ని గెలుచుకున్నాం’ అని. కానీ ఆరోవారంలో అకారణంగా ఎలిమినేట్ అయిన నయన పావని నిజంగానే జనాల మనసుల్ని గెలుచుకుందనే హౌస్‌లో ఆడని వాళ్లని పూజిస్తున్నారు? ఆడే వాళ్లని పనికిరాని రీజన్స్ చెప్పి ఎలిమినేట్ చేస్తున్నారు. మెచ్యూర్డ్‌గా గేమ్ ఆడుతున్న నయనిని బయటకు పంపించేశారు.

శోభాశెట్టిని తప్పించడానికి నయని దారుణంగా తొలివారమే ఎలిమినేట్ చేశారు. అశ్విని, పూజా, శోభాశెట్టి కంటే.. నయని గేమ్ బాలేదంటే నమ్మడానికి జనం పిచ్చోళ్లా? పాపం ఆ పిల్ల బాగా ఆడుతుంది సార్.. కావాలంటే నన్ను ఎలిమినేట్ చేసి.. ఆమెను హౌస్‌లో ఉంచండి అని అన్నప్పుడు.. ‘ఇది ఆడియన్స్ నిర్ణయం కదా శివాజీ’ అని హోస్ట్ నాగార్జున ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు.వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి వచ్చిన నయని.. ఫుల్ ఎంటర్ టైన్ చేసింది. టాస్క్‌లలో కూడా మంచి పెర్పామెన్స్ ఇచ్చింది. తొలివారంలో ఇంతకంటే బెటర్ పెర్ఫామెన్స్ ఇచ్చిన కంటెస్టెంట్.. ఈ సీజన్‌లో ఎవరు లేరంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed